చెత్త బుట్టలు పంపిణీ చేసిన ఎంపిటిసి

52చూసినవారు
చెత్త బుట్టలు పంపిణీ చేసిన ఎంపిటిసి
వెల్దండ మండల పరిధిలోని పలుగు తండలో ఎంపిటిసి మోతిలాల్ నాయక్ తమ సొంత ఖర్చులతో 300 తడి చెత్త పొడి చెత్త బుట్టలు సర్పంచ్ భక్య నాయక్ తో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరు డబ్బాలలో వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పరిసరాలు శుభ్రంగా వున్నప్పుడే మనం ఆరోగ్యంగా వుంటామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుజ్జి, గ్రామ కార్యదర్శి మంజుల, వార్డు సభ్యులు అంజ నాయక్, వెంకట్ నాయక్, దశరథ్ నాయక్, గోపాల్ నాయక్, రమేష్ నాయక్, శివ నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్