మహబూబ్ నగర్ లోని ప్రతి కాలనీలో మౌళిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 23లో నూతనంగా నిర్మించిన మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.