ఎస్సీ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు విచారణ కమీషన్ తరపున హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమిమ్ అక్తర్ ఈనెల 31న మహబూబ్ నగర్ కు వస్తున్నారని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తలిపారు. జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మహాబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ సభ్యులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వవచ్చని చెప్పారు.