ఆలయాలకు సంబంధించిన భూములను కాపాడుతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ ఆలయం తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైన ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలను, భూములను పట్టించుకోలేదని అన్నారు.