వంగూర్ మండలం తిప్పారెడ్డి పల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఏడు మంది రైతుల కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేశారు. తిప్పారెడ్డిపల్లిలో చోరీ చేసిన అనంతరం కోనేటి పూర్ గ్రామం వద్ద కేబుల్ వైర్లు చోరీ చేయడానికి ప్రయత్నం చేయడంతో రైతులు అప్రమత్తమై వెంబడించారు. దీంతో దొంగతనానికి వచ్చిన దొంగలు తమ బైక్ ను కోనేటి పూర్ టోల్ గేట్ సమీపంలో వదిలి పరారయ్యారు. పోలీసులు బైక్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.