రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
రవాణా రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఫ్రీ బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు జీవన భృతి చెల్లించాలని నాగర్ కర్నూల్ జిల్లా సిఐటియు కార్యాలయంలో రవాణా రంగ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనేక ప్రమాదాలు జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను పాటించడం లేదని విమర్శించారు.