జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్ లో పోలీస్, ఎక్సైజ్, విద్యా, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.