మరికల్ మండలం జిన్నారం మండలం పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తహశీల్దార్ జమిల్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంట గదిలో వున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. వంట గదిలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు.