చెట్లను తొలగించిన పోలీసులు

53చూసినవారు
చెట్లను తొలగించిన పోలీసులు
ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు నారాయణపేట మండలం అంత్వర్ గ్రామ స్టేజి వద్ద రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను పోలీసులు తొలగించారు. భారీ గాలులకు నారాయణపేట హైద్రాబాద్ ప్రధాన రహదారిపై అడ్డంగా చెట్లు పడటంతో కొంత సమయం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసు సిబ్బంది ట్రాక్టర్ డోజర్ సహాయంతో చెట్లను తీసివేశారు. దింతో వాహనాలు యధావిధిగా రాకపోకలు సాగించాయి.

సంబంధిత పోస్ట్