రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు శుక్రవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు. ఇవాల్టి నుంచే విద్యా సంస్థలో ఉచిత విద్యుత్ అమలులోకి వస్తుందని.. జీఓ విడుదల చేశామని వెల్లడించారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.