పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన వనపర్తి ఎమ్మెల్యే

59చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన వనపర్తి ఎమ్మెల్యే
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులదే కీలక పాత్ర అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం ఖిల్లాగణపురం మండలంలోని గౌరీదేవి పల్లిలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్