వనపర్తి: ఆత్మకూరులో బొలెరో వాహనం బీభత్సం

81చూసినవారు
వనపర్తి: ఆత్మకూరులో బొలెరో వాహనం బీభత్సం
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సోమవారం ఓ బొలెరో వాహనం బీభత్సం సృష్టించింది. పండ్లు కొంటున్న ఇద్దరు వినియోగదారులపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో వాహనం ఢీకొట్టడంతో పండ్ల బండి, ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసం అయ్యాయి. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్