వనపర్తి: నాణ్యమైన భోజనాన్ని అందించాలి

67చూసినవారు
వనపర్తి: నాణ్యమైన భోజనాన్ని అందించాలి
ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటిస్తూ కామన్ డైట్ మెనూ పక్కగా అమలు చేయాలని వనపర్తి జిల్లా ప్రత్యేక అధికారి షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. బుధవారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్ రూమ్ ను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనాన్ని వడ్డించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్