మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా నుండి కొత్త బస్టాండ్ వరకు కోనో కార్పస్ చెట్లు ఏర్పాటు చేయడం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతు, కోన కార్పస్ చెట్ల వలన ప్రజలకు అందాల్సిన ఆక్సిజన్ అందకుండా, విష వాయువులు అందుతున్నాయని, దానివల్ల పట్టణ ప్రజలు వింత రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.