కన్నేపల్లి: తడిసిన ధాన్యం పరిశీలన

71చూసినవారు
కన్నెపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎమాజీ, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకూ బిజెపి నిరంతరంగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్