కన్నేపల్లి మండలంలో అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి డిమాండు చేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల వరి ధాన్యం, పత్తి పంట పూర్తిగా నష్టం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.