బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఏరియా జిఎం శ్రీనివాస్ తో కలిసి కైరీగూడా ఓపెన్ కాస్ట్ ను సందర్శించి ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గనిలోకి వెళ్లి పని స్థలాలు, నిలువ నీరు, పంపింగ్ వ్యవస్థను పరిశీలించారు. వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.