108 ఆంబులెన్స్ లో ఆడ శిశువు జననం

60చూసినవారు
108 ఆంబులెన్స్ లో ఆడ శిశువు జననం
జన్నారం మండలం లోతొర్రే గ్రామానికి చెందిన రూప అనే మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండగా ఆమె భర్త సంజీవ్ శుక్రవారం ఉదయం 108 సిబ్బందికి సమాచారం అందించాడు. ఆమెను ఆంబులెన్స్ లో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే జన్నారం పట్టణానికి సమీపాన 108 అంబులెన్స్ లోనే ప్రసవించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఈఎంటి రమేష్, పైలట్ సంపత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్