మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై అమలులో ఉన్న నిషేధాజ్ఞలను నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి దాడులకు, ఆగడాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డీజే, డ్రోన్ లపై ఉన్న ఆంక్షలు కూడా నవంబర్ 1 వరకు కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.