తులసి మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉనాయి. అంతే కాకుండా తులసి గింజల వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు తులసి ఆకులతో నయమవుతాయి. తులసి గింజల్లో ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. ఫలితాలు మెరుగైన జీర్ణక్రియ, ఆమ్లత్వం నియంత్రణ, గ్యాస్ ఉన్నాయి. మలబద్దకానికి తులసి గింజలు సహజ నివారణ అని నిపుణులు వెల్లడిస్తున్నారు.