భారీ భూకంపం.. సునామీ అలర్ట్‌

78చూసినవారు
ప్రపంచంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలని వణికిస్తున్నాయి. తాజాగా దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ద్వీపమైన టోంగాకు సమీపంలో భారీ భూకంపం చోటుచేసుకున్నది. 7.1 తీవ్రత నమోదుకావడంతో టోంగాలోని దీవులకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. టోంగా అనేది 171 దీవుల సముదాయం కాగా, ఇక్కడ దాదాపు లక్ష మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనిఅధికారులు  సూచించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్