పోలీస్‌ కస్టడీకి మస్తాన్‌సాయి

67చూసినవారు
పోలీస్‌ కస్టడీకి మస్తాన్‌సాయి
లైంగిక వేధింపుల కేసులో మస్తాన్‌ సాయిని రాజేంద్రనగర్‌ కోర్టు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్‌ పోలీసులు కోర్టును కోరగా, రెండు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో మస్తాన్‌సాయిని నార్సింగి పోలీసులు ఈ నెల 13న కస్టడీలోకి తీసుకోనున్నారు. యువతి వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన మస్తాన్‌‌సాయి ప్రస్తుతం జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు.

సంబంధిత పోస్ట్