వర్షా కాలంలో బొప్పాయి తోటల్లో పాటించాల్సిన చర్యలు

82చూసినవారు
వర్షా కాలంలో బొప్పాయి తోటల్లో పాటించాల్సిన చర్యలు
వర్షాకాలంలో బొప్పాయి పంట తెగుళ్ల భారిన పడే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. వర్షాకాలం రాకముందే చెట్ల మధ్య దున్నడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి త్వరగా ఇంకిపోయి నీరు నిలబడకుండా ఉంటుంది. వర్షాలు తగ్గిన వెంటనే మొక్కల మధ్య అంతర్ సేద్యం చేసి కలుపును నివారించుకోవాలి. నీరు ఎక్కువగా నిలిస్తే కాండం కుళ్ళు తెగులు వస్తుంది. మెటలాక్సిల్ ఎం.జెడ్ 3 గ్రా లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా ఒక లీటర్ నీటికి కలిపి కాండం, మొదళ్ళలో తడిచేలా పిచికారీ చేయాలి.

సంబంధిత పోస్ట్