కోహెడ: కాంగ్రెస్ పై రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మాంకాల రమేష్ శనివారం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై రైతులు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాలు నిర్వహిస్తామని, రైతుబంధుకు ఎగనామం పెట్టి రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు భరోసా పై రైతులు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.