పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం వద్ద పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. ఏడుపాయలలో పతాకావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కరోనా వైరస్ నుండి దేశ, రాష్ట్ర ప్రజలందరినీ కాపాడాలని వనదుర్గామాతను వేడుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, లక్ష్మీ నారాయణ, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.