ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే
మెదక్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన ధాన్యం పూర్తిగా తడిసిందని.. ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్ మంగళవారం అన్నారు. జిల్లాలో ఎంత మేరా ధాన్యం తడిసిందో వ్యవసాయశాఖ అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారని, ఆ నివేధికలను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కోన్నారు.