మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని 5వ వార్డులో ఉన్న లక్ష్మీ అమ్మవారు గుడి దగ్గర మంచినీటి సమస్య ఉందనే విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ అశోక్ గౌడ్ శనివారం కొత్త మోటారు బిగించి అక్కడున్న సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సంఘసాని సురేష్, వార్డు ఆఫీసర్ పరశురాం రెడ్డి, వాటర్ సప్లై ఇన్‌స్పెక్టర్ వినీత్ రాజ్, మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.