మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. 10 సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ పార్టీని బద్నం చేస్తుందని ఆరోపించారు.