

సంగారెడ్డి: పాశమైలారం ఘటన.. హృదయ విదారకం (చిత్రాలు)
తెలంగాణలో ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఇండస్ట్రీస్ ఔషధ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 42 మంది మృతి చెందగా, మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నట్టు సమాచారం. ఆసుపత్రిలో మృతదేహాలు వరుసగా ఉండగా, ఘటన స్థలం విషాదంగా మారింది.