29న 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్: కేటీఆర్
33 జిల్లా కేంద్రాల్లో ఈనెల 29న దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీక్షా దివస్లో కేసీఆర్ పాల్గొనటం లేదని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. '2009 నవంబర్ 29 కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది. 26న అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం. కార్యక్రమాల నిర్వహణకు అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంచార్జీలుగా నియమించాం' అని అన్నారు.