ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ హాకీ జట్టు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2024లో భారత్ హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు 4-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. భారత్ తరుపున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రెండు గోల్స్ చేశాడు. ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని పెంచారు. ఇక సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో ఆతిథ్య చైనాతో భారత్ తలపడనుంది.