TG: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ MLA పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణకు హాజరయ్యారు. డిసెంబర్ 4న కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్ PSకు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్‌చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ ఫిర్యాదు చేయగా కేసు నమోదు అవడంతో ఇవాళ ఉదయం మాసబ్ ట్యాంకు పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు.