నేడు MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

62చూసినవారు
నేడు MBNR స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇవాళ పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1,439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2న ఓట్లు లెక్కించనున్నారు.

సంబంధిత పోస్ట్