TG: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటు సాధనకై మంగళవారం ఇందిరా పార్క్ వద్ద BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేయన్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ దీక్ష ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇందిరా పార్క్ వద్ద ఏర్పాట్లను తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, UPF కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ పరిశీలించారు.