TG: మోహన్ బాబు మంగళవారం రాత్రి TV9 రిపోర్టర్ రంజిత్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. గాయపడ్డ బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి CT స్కానింగ్ తీయగా దవడ పైభాగంలో ఉండే జైగోమాటిక్ బోన్ మూడు చోట్ల విరిగినట్లు తేలింది. అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. మరోవైపు తమపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు నిరసన తెలిపారు.