క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన కల్వకుర్తి ఛైర్మ‌న్‌

547చూసినవారు
క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసిన కల్వకుర్తి ఛైర్మ‌న్‌
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శ‌నివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు వెళ్ళతున్న కల్వకుర్తి జట్టుకు మాజీ ఎమ్మెల్యే కీశే ఎడ్మ కిష్టారెడ్డి జ్ఞాపకార్థం ఆయన తనయుడు కల్వకుర్తి పురపాలక సంఘం ఛైర్మన్ ఎడ్మ సత్యం చేతుల మీదుగా శ‌నివారం క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి భజరంగ్ యూత్ సభ్యుడు మిరియాల వినయ్ కుమార్ రెడ్డి, పిఎసిఎస్ ఛైర్మ‌న్ జనార్ధన్ రెడ్డి, కౌన్సిలర్ బోజిరెడ్డి, కల్వకుర్తి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ గౌడ్, కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి, జేఏసీ కన్వీనర్ సదానందం గౌడ్, నాయకులు ముజ్జు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్