వంగూర్ మండలంలో మిషన్ భగీరథ నీళ్లు సరిపోయినన్ని రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఒకటి, రెండు బిందెలకు సరిపోయిన నీళ్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో నీటి అవసరాలు తీర్చుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఓ మోస్తారుగా నీళ్లు వచ్చేవని కానీ ఇప్పుడు నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని గురువారం మండలానికి చెందిన పలువురు మహిళలు తెలిపారు.