క్రీడా రంగానికి పెద్ద పీట
రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బిసి గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడా రంగంలో రాణించాలని, దానికి కావలసిన పూర్తి సహకారం ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వమ్ అందిస్తుందని అన్నారు.