నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కడ్తాల్ మండలం రావిచెడు గ్రామంలో గురువారం నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ భక్తి అలవర్చుకోవాలని అన్నారు. వారికి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ యాదయ్య, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రంగయ్య, సర్ధార్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.