దేవరకొండ: నియోజకవర్గంలో శనివారం పలుచోట్ల బంజారాల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సంఘసoస్కర్త అయిన సేవలాల్ మహారాజ్ ప్రజల్లో మూడ నమ్మకాలను పారద్రోలేందుకు ఎంతో కృషి చేశారని, ప్రతి ఒక్కరూ సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలని అన్నారు.