అక్టోబరు2 గాంధీ జయంతి సందర్భంగా కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం గాంధీ జీవిత విశేషాలపై పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి ఎం. డి సలీం షరీఫ్ మాట్లాడుతూ క్విజ్ పోటీలతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానో పాధ్యాయులు డి మార్కండేయ, క్విజ్ నిర్వాహకులు బడుగుల సైదులు ఉన్నారు.