డీ-37 కాల్వ చివరి భూముల సాగునీరందడం లేదని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని గోపాలపురం, కన్నెకల్, మాచినపల్లి, కేశవాపురం గ్రామాల రైతులు శనివారం కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ డీ-37 కాల్వ నిర్మాణం కోసం అనేక మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని, కాల్వ తవ్విన తర్వాత చివరి భూములకు నీరందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.