మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మేధావులు మాట్లాడుతూ వీరజవాన్ల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ జాతి కోసం అమరులైన వారి మరణం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.