కేతేపల్లి మండలంలో కొనసాగుతున్న వరి కోతలు

51చూసినవారు
కేతేపల్లి మండలంలో వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. కేతేపల్లి మండలంలో మూసి ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా బొప్పారం, కాసనగోడు, కొత్తపేట, కేతేపల్లి, చీకటిగూడెం, ఉప్పలపహాడ్, కొప్పోలు, భీమారం, తుంగతుర్తి, చెర్కుపల్లి గ్రామాలలోని భూముల్లో ప్రధానంగా వరి సాగు అవుతుంది. యాసంగి కాలంలో వరి చివరి దశకు రావడంతో గత వారం రోజుల నుండి కేతేపల్లి మండలం వ్యాప్తంగా రైతులు వరి పొలాలు కోత మిషన్ లతో కోయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్