ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని శనివారం నల్గొండ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తేమశాతం 17 వచ్చిన తర్వాత కాంట వేసి మిల్లులకు పంపించాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు