ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

2399చూసినవారు
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ఒకప్పుడు పెద్దలు మందలిస్తే అది మన మంచికోసమే అనుకునే వారు కానీ మారుతున్న కాలంతో పిల్లల మనస్తత్వాలు మారుతున్నాయి. చిన్నపాటి మందలింపుకు కూడా ఈ రోజుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నేటి యువత. అలాంటి కోవలోనే జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి మందలించాడని కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చాడు. ఈ సంఘటన గుర్రంపోడు మండలంలోని తేనేపల్లితండాలో మంగళవారం రాత్రి జరిగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం తేనేపల్లితండా గ్రామానికి చెందిన వాడిత్య కల్యాణ్‌(20) డిగ్రీ చదివి ఏ పని చేయకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తాగి ఇంటికొచ్చిన కుమారుడిని తండ్రి వాడిత్యా వెంకటపతి మందలిచాడు. దీంతో ఆవేశానికి లోనైన కల్యాణ్‌ ఇంటి నుంచి బయటికి వెళ్లి గ్రామ శివారులోని చెట్టుకు డ్రిప్‌పైపుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం స్థానిక రైతు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్