శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన గందమల్ల మదన్ తేజ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ నల్గొండ ఐకాన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరికి నకిరేకల్ కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు గురువారం ఐకాన్ హాస్పిటల్ వెళ్లి రూ. 20,200 సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మదేవర నరేష్, రాసమల్ల శ్రీను, ప్రవీణ్, శ్రీకాంత్, సైదులు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.