నార్కట్ పల్లి సీపీఎం మండల కమిటీ సభ్యులు, మండల మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ కల్లూరి యాదగిరి ఆదివారం రాత్రి 11-30గం, కు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో మరణించారని సీపీఎం మండల కమిటీ పేర్కొంది. ఆయన మరణం పట్ల సీపీఎం నల్గొండ జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంత్యక్రియలు ఇవాళ మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలో జరుగుతాయని చెప్పారు.