నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా శనివారం డా. బాబుజగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపారి శుక్రవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కావున రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు.