రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని, శుక్రవారం నార్కట్ పల్లి మండలం గోపలాయిపల్లిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశానుసారం మార్కెట్ కమిటీ చైర్మన్ నర్ర వినోదా మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, తహశీల్దార్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.